తూప్రాన్; మెదక్ గడ్డ అంటేనే గులాబీ అడ్డ అని, మెదక్ గడ్డ మీద గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు.. తూప్రాన్ లో జరిగిన తూప్రాన్ పట్టణ, మండల, మనోహరబాద్ మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ డా వంటేరు యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి లతో కలిసి మాట్లాడారు..
గడా అధికారిగా, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గా ఇక్కడ పనిచేయడం జరిగిందన్నారు..మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గజ్వెల్ నియోజకవర్గం అభివృద్ధి లో 50 ఏళ్ళు ముందుకు పోయిందన్నారు..మాయ మాటలు రావని, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వొస్తున్నానన్నారు..కలెక్టర్ గా ఖ్యాతి ఇచ్చిన ఈ గడ్డే నాకు రాజకీయ జీవితం కూడా ఇవ్వాలని కోరారు మాజీ కలెక్టర్ గా ఉన్న నాకు మెదక్ ఎంపీ గా పార్లమెంటు లో అడుగు పెట్టె అవకాశం కల్పించాలన్నారు.
.రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ స్పూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామని, ఆయన స్పూర్తితో ముందుకు సాగుతున్నామని ఆయన జయంతి సందర్భంగా నివాళి అర్పించి, ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు…పరిపాలనా అనుభవం తో మీ సమస్యల పరిష్కారం కోసం సులువవుతుందన్నారు..కలెక్టర్ గా పనిచేసే సమయంలో నా దగ్గరికి వొచ్చే వాళ్లలో నా తోబుట్టువుల ను చూశానని, బాధ్యతతో పనిచేయడం జరిగిందన్నారు..
ట్రస్టు ద్వారా..యువతకు అండగా…నిలుస్తా
నాకు డబ్బు మీద యావ లేదని, పేద ప్రజల సేవ మీదనే నా దృష్టి ఉందన్నారు..నేను చేసే సేవ నా తర్వాత కూడా 50 ఏళ్ళు నా పేరు నిలిచి ఉండేలా అన్నదే నా ద్యేయం అన్నారు..మాది రాష్ట్రంలోనే అతిపెద్ద ఉమ్మడి కుటుంబమని, 30 మంది ఒక్క చోటనే ఉంటామని, ఒక్క దగ్గరే తింటామని తెలిపారు..ఎంపీ గానే కాకుండా..నా ఉమ్మడి కుటుంబ సభ్యుల సహకారంతో 100 కోట్ల తో ట్రస్ట్ ఏర్పాటు చేసి మీకు అండగా ఉంటామన్నారు. యువతీ, యువకులకు కోచింగ్ కేంద్రాలు, వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి తర్వాత జాబ్ మేళా వేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు..
మహిళలకు సైతం కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా నిలుస్తామన్నారు..నాలాగా పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా వారిని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.. యువత చెడు దారిలో పడకుండా సరైన దారిలో నడిచేలా చూస్తామన్నారు.. బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో మంది ఖరుడు గట్టిన కార్యకర్తలు పనిచేస్తున్నారని, ఎంతో పేదరికంలో ఉన్నారని వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు.. బీఆర్ఎస్ కార్యకర్తలు, నిరుపేదల కోసం 7 నియోజకవర్గంలలో ఫంక్షన్ హాళ్లు నిర్మించి కేవలం ఒక్క రూపాయి తో వారికి అందిస్తామన్నారు..
నా మాట గా ఇంటింటికి చెప్పండి, వెంకట్రామరెడ్డి ట్రస్టు ఏర్పాటు చేసి ఆదుకుంటాడని,కారు గుర్తుకె ఓటు వేసి గెలిపించాలని తెలుపాలన్నారు,మీ ఆశీర్వాదంతో ఎంపీ గా గెలవడం ఖాయమన్నారు..
వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయం
ఎంపీ ఎన్నికల్లో మాజీ కలెక్టర్ పి వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమని ;ఎమ్మెల్సీ డా:వంటేరు యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, టీ ఎస్ ఎంఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ లు పేర్కొన్నారు..మాయా మాటలు చెప్పి మోసం చేసిన రఘునందన్ రావు ను చిత్తుగా ఓడించారని వారు కోరారు..స్వార్ధ పరులే పార్టీలు మారుతారని, కరుడు గట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలున్నారని వారికి అండగా నిలుస్తామన్నారు. మాజీ కలెక్టర్ గా వెంకట్రామరెడ్డి ఈ ప్రాంత అభివృద్ధి లో కీలకపాత్ర పోషించారన్నారు. ఈ .కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, జడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, ఎంపీపీ పురం నవనీత రవి, మాజీ ఏఎంసీ , రైతుబంధు చైర్మన్ లు మాదాసు శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు సతీష్ చారి, బాబుల్ రెడ్డి, మహేష్, మాజీ ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆంజనేయులు మన్నే శ్రీనివాస్, నర్సింహారెడ్డి, చంద్రారెడ్డి, కిష్టారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, చక్రవర్తి, నాగరాజు, బురాన్, అహ్మద్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..