Friday, November 22, 2024

BRS – మ‌రో రెండు స్థానాల‌కు అభ్య‌ర్ధుల పేర్ల‌ను ప్ర‌క‌టించిన బిఆర్ ఎస్..

మెద‌క్ నుంచి మాజీ క‌లెక్ట‌ర్ వెంక‌ట‌రామిరెడ్డి
నాగ‌ర్ క‌ర్నూల‌లో ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్
ఒక‌రు మాజీ ఐఎఎస్, మ‌రొక‌రు మాజీ ఐపిఎస్

హైద‌రాబాద్ – మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి., నాగ‌ర్ క‌ర్నూలు నుంచి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బ‌రిలోకి దిగ‌నున్నారు.. ఈ మేర‌కు ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్ర‌క‌టించారు.. ఎర్ర‌వెల్లి ఫామ్ హౌజ్ లో నేడు ఆయ‌న మెద‌క్ ,నాగ‌ర్ క‌ర్నూలు నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు.. గ‌తంలో మెద‌క్ కు ప్ర‌క‌టించిన వంటేరు ప్ర‌తాప్ రెడ్డి పోటీకి స‌ముఖ‌త వ్య‌క్తం చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న స్థానంలో వెంట‌క‌రామిరెడ్డిని ప్ర‌క‌టించారు.. ఇక బిఎస్పీ కి రాజీనామా చేసిన ప్ర‌వీణ్ కుమార్ నాగ‌ర్ క‌ర్నూల్ లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేయ‌నున్నారు..

సుదీర్ఘకాలం జిల్లాలో అధికారిగా విధులు…

వెంకట్రాంరెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లాతో అవినాబావ సంబంధం ఉన్నది. ఉమ్మడి జిల్లాలో అధికారిగా వివిద హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. డ్వామా పీడీ మొదలుకుని అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గా, 2014 నుంచి 2017 వరకు ఉమ్మడి జిల్లా జేసీగా పనిచేశారు. ఆ తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా సుదీర్ఘకాలం ఐదేండ్లు పనిచేశారు. ఆ తరువాత మెదక్ జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గా కూడా ఇక సంవత్సరం పాటు విధులు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఎక్కడి వెళ్లినా వెంకట్రాంరెడ్డి సుపరిచుతడని చెప్పుకోవచ్చు. మాజీ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ కారణంగానే సర్వీసు ఉండగానే ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కెసిఆర్ . కాగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రంగనాయక్ సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ల నిర్మాణంలో వెంకట్రాంరెడ్డి ప్రధాన పాత్ర పోషించారు.ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ చేయడంలో సక్సెస్ అయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement