Thursday, December 19, 2024

BRS – భూభార‌తి పేరుతో ప్ర‌క‌ట‌న‌లు – ప్ర‌భుత్వంపై బిఆర్ఎస్ స‌భాహ‌క్కుల నోటీస్

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తున్నది. ఈ నేపథ్యంలో భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది ప్ర‌భుత్వం. దీనిపై బీఆర్‌ఎస్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. శాసనసభ హక్కులను రక్షించాలని స్పీకర్ ప్రసాద్‌ కుమార్‌ను బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం కోరింది. నేటి దినపత్రికల్లో చట్టానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందని, ఆమోదం పొందని బిల్లును చట్టంగా ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని పేర్కొంది. శాసనసభలో చర్చ దశలో ఉన్న బిల్లును చట్టంగా పేర్కొనడంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 245 ప్రకారం సభా హక్కులకు హాని జరిగిందని తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement