ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కలిశారు. గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దామని కేసీఆర్ అన్నారు. అంతేకాదు, రాష్ట్రంలో ఏర్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిద్దామనీ పిలుపు ఇచ్చారు ..
ప్రజలకు తాము అభివృద్ధి చూపించామని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పుడు వారు ఇచ్చిన తీర్పును శిరసావహిద్దామని తెలిపారు. వారు చెప్పినట్టుగానే ప్రతిపక్ష పాత్రను విజయవంతంగా పోషిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీకి నాలుగు నెలల సమయం ఇద్దామని, నాలుగు నెలలు ఆగి కాంగ్రెస్ ఏం చేస్తుందో చూద్దామని సూచన చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కార్యచరణ అమలు చేద్దామని తెలిపారు
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు సోమవారం గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.
— BRS Party (@BRSparty) December 4, 2023
ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ గారిని కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి కేసీఆర్… pic.twitter.com/ckYoTNTJBC