న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ సమావేశాల తొలిరోజున పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. ఆ పార్టీకి చెందిన ఎంపిలందరూ రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉన్నారు.. దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత కె కెశవరావు మాట్లాడుతూ, తాము రాష్ట్రపతికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన ఉంటుందని, కేంద్ర ప్రజావ్యతిరేక నిర్ణయాలు పార్లమెంట్లో ఎండగడుతామని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలోనూ స్పష్టంగా చెప్పామని అన్నారు. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామని, అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు పట్టుబడతామని కెకె వెల్లడించారు.. రాష్ట్రపతి ప్రసంగ కార్యక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బహిష్కరించింది..