హైదరాబాద్ – గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా రేపు తెలంగాణ భవన్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గులాబీ బాస్ కేసీఆర్ హాజరు కానున్నారు. తమకు సిట్టింగ్ స్థానంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని దక్కించుకోవాలని బీఆర్ఎస్ యోచనలో ఉంది. ఈ క్రమంలోనే.. కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
కాగా.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికకు సంబంధించి మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి బరిలో నిలవగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మరోసారి అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఈ స్థానంలో మొత్తం 52 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు.. ఇక్కడ పోలింగ్ ఈ నెల 30వ తేదిన జరగనుంది.