Saturday, September 21, 2024

BRS Party – దావోస్ లో రేవంత్ చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్దాలే…. క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే – కెటిఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడినా గవర్నర్‌కు తప్పు కనిపించిందని.. కానీ, కాంగ్రెస్‌ విషయంలో ఆమె పూర్తి సానుకూలంగా ఉందని విమర్శలు చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి , కేటీఆర్ . రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చి ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కేలా చేశారని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న నేడు మీడియాతో చిట్ చాట్ చేస్తూ, తాము అనుభవం ఉన్న వారిని సలహాదారులుగా నియమించుకుంటే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడెలా రాజకీయ నాయకులను సలహాదారులుగా నియమించుకున్నారని ప్రశ్నించారు. వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఏం సలహాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు వుంటుందా? అనే అనుమానం ప్రజల్లో వుందని షాకింగ్ కామెంట్స్ చేశారు.. కొత్త ప్రభుత్వంపై కొద్ది రోజుల్లోనే అసాధారణంగా వ్యతిరేకత వచ్చిందని, హామీలు అడిగితే… మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజల మనసులు గాయ పడతాయన్నారు కేటీఆర్‌. రేవంత్ దావోస్ కు పోయి పచ్చి అబద్ధాలు చెప్పారని, రైతు బంధు ఉండగా… మొదలు పెట్టనీ రైతు భరోసా ఇస్తున్నామని రేవంత్ అంటున్నారన్నారు. దీనిపై రేవంత్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు..

తెలంగాణాలో కేసీఅర్ ను, బీఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ లు కుమ్మక్కు అయ్యాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు లెక్క బెడితే 420 అని వచ్చింద‌ని,…వాళ్ళను అవమానించే ఉద్దేశ్యం లేదని అన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు ను హై కోర్టు కు ఇవ్వడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ? అని ఆయన ప్రశ్నించారు. దావోస్ కు రేవంత్ ఎందుకు వెళ్ళాడు అన్నట్టుగా భట్టి విక్రమార్క మాటల దాడి ఉందని, బహుళ జాతి సంస్థలపై భట్టి విక్రమార్క దుర్మార్గంగా మాట్లాడారన్నారు. ఏ విచారణ అయినా చేసుకోండి…తప్పు చేసిన వారిని దోషిగా నిలబెట్టoడి…అభ్యంతరం లేదని, తేల్చి చెప్పారు… లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొంటామన్నారు. పార్టీ నిర్మాణం పై ఇక ముందు దృష్టి పెడతామని చెప్పారు..
‘రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నారని కోమటిరెడ్డి అనలేదా? అంటూ కెసిఆర్ ప్ర‌శ్నించారు.. కాంగ్రెస్ పార్టీకి ఒక సీఎంను ఐదు సంవత్సరాలు కొనసాగించే చరిత్ర లేద‌ని అన్నారు. త‌మ‌ పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో 420 హామీలు అమలు చేస్తారా? లేదా? అనే అంశం మీద అని అన్నారు. . కాంగ్రెస్, బీజేపీ కోఆర్డినేషన్ పర్ఫెక్ట్‌గా నడుస్తోంది. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారని అన్నారు. కానీ అనేక విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటుందని.. అందుకే రాష్ట్ర బాగు కోసం తాము స్పందిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సచివాలయం కడితే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త సీఎం క్యాంపు ఆఫీసు, కొత్త హైకోర్టు ఎట్లా కడుతున్నారని ప్రశ్నించారు. సీఎం మారినప్పుడల్లా కొత్త క్యాంపు ఆఫీసులు వస్తాయా? అని అడిగారు. తాము కట్టిన ప్రగతి భవన్‌ను ఇగోతో డిప్యూటీ సీఎం భట్టికి రేవంత్ రెడ్డి ఇచ్చారని సీరియస్ కామెంట్స్ చేశారు. కేబినెట్‌లో చర్చించకుండానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సాధించింది ఏం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుండే జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వంద రోజుల్లో హామీలను అమలు చేయాలని అన్నారు.

ఇక అసెంబ్లీ నియోజకవర్గాలలో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 10 లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తెలంగాణ బలగం అనే పేరుతో బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇకపై ఉంటుందన్నారు. జిల్లా కమిటీలు లేవ‌ని, వాటిని వేస్తామ‌ని తెలిపారు.. ఫిబ్రవరి రెండవ వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు అని అంటున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 14 నియోజకవర్గాలు స్వల్ప తేడాతో ఓటమి చెందామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గాల లో పటిష్టంగా పని చేసి ఉంటే గెలిచే వాళ్ళమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు . లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల సత్తా ఏంటో ప్రజలు చూపిస్తారని, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామని ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ ప్రజా పాలనలో ప్రజాప్రతినిధులకు అవమానం జరుగుతోందని అన్నారు. ఎన్నికలు నిర్వహించకపోతే సర్పంచుల పదవీ కాలం పొడిగించండని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement