కరీంనగర్ : బీఆర్ఎస్ పార్టీనే మా భవిష్యత్తు అని ప్రజలు నమ్ముతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… వ్యవసాయానికి పనికిరాని భూములు ఇప్పుడు కాళేశ్వరం నీటితో కలకలాడుతున్నాయన్నారు. కరువు నుంచి అద్భుతమైన పంటలు పండే రోజులు వచ్చాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ యువత భవిష్యత్తను కాపాడేది కేసీఆర్ మాత్రమే అన్నారు.
మానేరు రివర్ ఫ్రంట్ వస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఆంధ్రా ముసుగులో లీడర్లు వస్తున్నారు, నమ్మవద్దన్నారు. యువత భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే మరొక అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఈటెల రాజేందర్ భయపడే హుజురాబాద్ లోనూ పొటీ చేస్తానంటున్నారన్నారు. బండి సంజయ్ గంజాయి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గంజాయిని ఎవరైనా ప్రోత్సహిస్తారా ? కరీంనగర్ గంజాయి రహితంగా ఉండాలని సీపీకి ఇంతకు ముందే చెప్పామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ పాలనలో వలసలు తగ్గిపోయాయన్నారు.