న్యూఢిల్లీ: అదానీ సంక్షోభంపై జేపీసీ లేదా సీజేఐతో విచారణ చేపట్టాలని ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానం ఇచ్చినట్లు వెల్లడించారు. ఆర్థిక అంశం కాబట్టే వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ జరగాలని కోరామని పార్లమెంటరీ పార్టీ నేత కేకే అన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ మీడియాతో మాట్లాడారు. అదాని షేర్లు 27 శాతం పడిపోయాయని ఎంపీ కేకే చెప్పారు. షేర్ల వ్యవహారంపై జేపీసీ లేదా సుప్రీంకోర్టుతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యాపారస్తులు ప్రభుత్వ స్నేహితులుగా ఉన్నారని, అందే కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. సభ ఆర్డర్‌లో లేదని వాయిదా వేయడం సరికాదని ఆయన విమర్శించారు.
అదాని షేర్ల అంశంపై నోటీసులిచ్చామని, దానిపై చర్చ చేపట్టాలని స్పీకర్‌ను కోరినట్లు లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు.
అదానీ అంశంపై అన్నిపార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ వ్యాపారస్తుల కోసమే మోదీ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. అదానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. అన్ని రాష్ట్రాలను కూడగట్టుకుని పోరాటం చేస్తామన్నారు. జ్యుడీషియల్ విచారణ లేదా జేపీసీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Took part in the press meet with fellow BRS MPs at Vijay Chowk in New Delhi after giving adjournment motion at the Parliament today.@BRSparty @LokSabhaSectt pic.twitter.com/aeRSVyCoQn
— Dr Ranjith Reddy (@DrRanjithReddy) February 2, 2023