హైదరాబాద్ – అధికార పార్టీ బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్ కు భూకేటాయింపులను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఎంపీ ఆధ్వర్యంలోని ఫౌండేషన్ కు తెలంగాణ ప్రభుత్వం 2018లో 15 ఎకరాలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం ఖానామెట్ లో ఈ భూమిని టీఆర్ఎస్ సర్కారు కేటాయించింది.
అయితే, ప్రభుత్వ నిర్ణయంపై కొంతమంది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ విజయ్ సేన్ లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. వాదోపవాదాలు విన్న తర్వాత నేడు తీర్పు వెలువరించింది. భూ కేటాయింపుల్లో ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా ఉండేలా పున:పరిశీలన చేయాలంటూ ప్రభుత్వానికి సూచించింది.