Tuesday, November 26, 2024

మండ‌లి వ‌ద్దు – అసెంబ్లీ ముద్దు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రధాన ప్రతినిధి: రాష్ట్రంలో పెద్దల సభకు (శాసనమండలి) ప్రాతినిధ్యం వహిసిస్తున్న భారత రాష్ట్ర సమితి(భారాస) సభ్యుల్లో మెజార్టీ నేతలు ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ-కి రంగం సిద్ధం చేసుకుంటు-న్నారు. పార్టీ అధినేత ఆశీస్సుల కోసం తహతహ లాడుతున్నారు. పోటీ-కి సిద్ధమైన పలువురు ఎమ్మెల్సీలు తాము పోటీ- చేయాలనుకున్న నియోజక వర్గాల్లో పర్యటిస్తూ భారాస స్థానిక నేతలను మచ్చిక చేసుకునే పనిలో ఉండగా సిట్టింగ్‌ ఎమ్యెల్యేలు తమకే టికెట్‌ వస్తుందంటూ ప్రచారం చేస్తుండడంతో ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల్లో రాజకీయ వేడి పెరిగింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వనున్నామని భారాస అధినేత కేసీఆర్‌ పలు సందర్భాల్లో ఇచ్చిన హామీని వారు గుర్తు చేస్తున్నారు. సిట్టింగ్‌లకు కాదని శాసన మండలి సభ్యులకు పోటీ- చేసే అవకాశం ఇస్తే దాదాపు 15 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీట్లు- గల్లంతయ్యే అవకాశం ఉందని భారాసలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్యెల్యేలందరికీ మరోసారి పోటీ-కి అవకాశం ఇస్తానని పార్టీ చీఫ్‌ కేసీఆర్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు, ఎమ్మెల్యేలు తనను కలిసిన సందర్భాల్లో చేప్పినా ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న వారిలో చాలా మంది సీనియర్లు ఉండడం వీరిలో పది మందికి పైగా సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ- రామారావుకు అత్యంత సన్నిహితులు కావడంతో వీరు నూటికి నూరు శాతం ఖచ్చితంగా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు అవకాశం దక్కించుకుంటారని, ఈ విషయంలో అధినాయకత్వంపై ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రయోజనం ఉండదన్న భావనలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు- సమాచారం. ఎమ్మెల్సీలుగా ఉన్న వారిలో కొందరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ- చేసేందుకు అన్ని హంగులు, ఆర్భాటాలు చేసుకుంటు-న్నట్టు- తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవీకాలం మరో నాలుగేళ్లపాటు- ఉన్నప్పటికీ ఎమ్యెల్యేగా పోటీ-కే మొగ్గు చూపుతుండడం భారాసలో చర్చకు దారితీస్తోంది.

ఒక వేళ తమ సిట్టింగ్‌ స్థానంలో మరో నేతను ఎంపిక చేసి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపితే తమ పరిస్థితి ఏంటన్న విషయంలో ఎమ్యెల్యేలు కొట్టు-మిట్టాడుతున్నారు. ఈ విషయంలో స్పష్టత తీసుకుని భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకునేందుకు సిద్ధమవుతున్నట్టు- సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ-కి అవకాశం రాని పక్షంలో ప్రత్యర్థి పార్టీల అధినేతలను కలసి టికెట్‌ హామీ పొంది ఆయా పార్టీలో చేరడమా లేక భారాసలో కొనసాగి అధినేత కేసీఆర్‌కు తమ భవిష్యత్‌ తీర్చిదిద్దే బాధ్యతను అప్పగించడంమా అన్నది ఆలోచించి త్వరలో నిర్ణయం తీసుకోవాలని వారు భావిస్తున్నట్టు- సమాచారం. మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌లతో పాటు- మాజీ ఎంపీ కవిత కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యే బరిలో ఉన్న ఎమ్మెల్సీలు వీరే?
నిజామాబాద్‌ స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఈసారి ఎమ్యెల్యేగా పోటీ-కి దిగే అవకాశం ఉంది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, లేదా జగిత్యాల జిల్లా జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ- చేస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ-కి దిగుతారన్న ప్రచారం కూడా లె కపోలేదు.

  • పాడి కౌశిక్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ-కి దిగనున్నారు. కౌశిక్‌ రెడ్డిని హుజురాబాద్‌ అభ్యర్థిగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ఇప్పటికే ప్రకటించారు. ఎమ్మెల్సీగా, శాసన మండలి విప్‌గా కౌశిక్‌ ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఆయన ఎమ్మెల్సీగా ఎన్ని-కై-న సంగతి విదితమే.
  • మధుసూదనాచారి గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన భూపాలపల్లి స్థానం నుంచి పోటీ-కి సిద్ధమవుతున్నారు. అధినేత కేసీఆర్‌తో ఇప్పటికే పలు దఫాలు మంతనాలు జరిపినట్టు- ప్రచారం జరుగుతోంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధుసూదనాచారి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన గండ్ర వెంకటరమణా రెడ్డి ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పి భారాసలో చేరారు. గత ఏడాది మధుసూదనాచారికి సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు.
  • ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేషన్‌ ఘనపూర్‌ స్థానంపై కన్నేశారు. తనకు కాకపోయినా తన కుమార్తెకు ఘన్‌పూర్‌ నియోజక వర్గంలో పోటీ-కి అవకాశమివ్వాలని కడియం కోరినట్టు- ప్రచారం జరుగుతోంది. ఈ నియోజక వర్గంలో రాజయ్య సిట్టింగ్‌ శాసన సభ్యులుగా ఉన్నారు.
  • రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కూడా ఎమ్మెల్యే బరిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచే ఆయన పోటీ- చేయాలన్న పట్టు-దలతో ఉన్నట్టు- సమాచారం.
  • ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి జనగాం అసెంబ్లీ బరిలో నిలవనున్నట్టు- తెలుస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్యెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యవహరిస్తున్నారు.
  • మంత్రి సత్యవతి రాథోడ్‌ ఈ దఫా మహబూబాబాద్‌ లేదా ములుగు అసెంబ్లీ నుంచి పోటీ- చేస్తారని అంటు-న్నారు.
  • హోం మంత్రి మహమూద్‌ అలీ నాంపల్లి అసెంబ్లీ నుంచి ఆయన పోటీ- చేస్తారని చెబుతున్నారు.
  • ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి మెదక్‌ అసెంబ్లీ నుంచి పోటీ-కి సిద్ధంగా ఉన్నట్టు- ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్టు- ప్రచారం జరుగుతోంది. శంభీపూర్‌ రాజు కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీకి పోటీ-పడుతున్నట్టు- సమాచారం. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా వివేకానంద్‌ ఉన్నారు.
  • ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి తాండూర్‌ నుంచి పోటీ-కి సిద్ధంగా ఉన్నానని ఆయన అధికారిక ప్రకటన చేశారు. ఇక్కడ పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ తనకు కాదనుకుంటే తన సతీమణి, వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సునీతారెడ్డి-కై-నా టికెట్‌ ఇవ్వాలని మహేందర్‌ రెడ్డి పట్టు-బట్టే అవకాశం ఉంది.
  • కల్వకుర్తి అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నానని స్థానిక నేత, ఎమ్మెల్సీ, బ్రిలియంట్‌ విద్యా సంస్థల అధినేత కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. భారాస తనకు పోటీ- చేసే అవకాశం ఇవ్వని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆయన తన సన్నిహితుల వద్ద ప్రకటించినట్టు- ప్రచారం జరుగుతోంది. ఇక్కడ జైపాల్‌ యాదవ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు.
  • మరో ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్‌రెడ్డి నాగర్‌ కర్నూల్‌ అసెంబ్లీకి పోటీ- చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు- తెలుస్తోంది. తన అభిప్రాయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్‌కు చెప్పానని ఆయన సానుకూలంగా స్పందించారని దామోదర్‌ రెడ్డి నియోజకవర్గ నేతలకు చెప్పినట్టు- ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మర్రి జనార్దన్‌ రెడ్డి ఉన్నారు.
  • పటాన్‌చెరు అసెంబ్లీ బరిలో దిగేందుకు మాజీ ఐఏఎస్‌, ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి పావులు కదుపుతున్నట్టు- ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ కుటు-ంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనకు టికెట్‌ దక్కడం ఖాయమన్న సంకేతాలున్నాయి. ఇక్కడ గూడెం మహిపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.
  • ఎమ్మెల్సీ కోటిరెడ్డి నాగార్జునసాగర్‌ అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నోముల భరత్‌ ఉన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement