జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే నరేందర్
కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తాం
కరీమాబాద్, నవంబర్ 25 (ఆంధ్రప్రభ) : మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఇవాళ మహబూబాబాద్ లో నిర్వహించే మహా ధర్నాకు భారీగా తరలివెళ్లారు. ధర్నాకు తరలివెళ్లే కాన్వాయ్ కు నన్నపనేని నరేందర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నరేందర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతులు, గిరిజనులు, దళితులు, ఆదివాసిలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇవాళ మహబూబాబాద్ లో ధర్నా చేపడుతున్నామన్నారు.
కేటీఆర్ అధ్యక్షతన తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున కాన్వాయ్ లో తరలివెళ్లారు. అనంతరం నరేందర్ జెండా ఊపి కార్యకర్తల భారీ కాన్వాయ్ ను ప్రారంభించారు.