మక్తల్ , నవంబర్ 27(ఆంధ్రప్రభ) : నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటన నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున ముందస్తుగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి సహా పలువురు బిఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మక్తల్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు.
పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారి 167 పై రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో చేపట్టిన విషయాన్ని తెలుసుకుని స్థానిక ఎస్సై వై.భాగ్యలక్ష్మి రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బిఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ రాస్తారోకో లో మాజీ మార్కెట్ చైర్మన్ కె.రాజేష్ కుమార్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు మొగులప్ప, జగ్గలి రాములు, బీఆర్ఎస్ నాయకులు కె.సోంభూపాల్ గౌడ్ ,శివారెడ్డి ,అన్వర్ హుస్సేన్,జుట్ల శంకర్, మహిమూద్, తదితరులు ఉన్నారు.