Saturday, June 29, 2024

BRS – ఫిరాయింపులపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు.. ప్ర‌తిఘ‌ట‌న ఉంటుంది

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న తరుణంలో ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని అన్నారు. గతంలో ప్రజా ఉద్యమం ఉద్ధృతంతో తెలంగాణ గట్టిగా ప్రతిస్పందించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే చరిత్ర పునరావృతం అవుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల శ‌క్తే బ‌లంగా ఉంటుంది..

- Advertisement -

సాధారణంగా అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని బీఆర్ఎస్ నేత‌ కేటీఆర్ అన్నారు. 2004 నుంచి 2006 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నో ఫిరాయింపులు జరిగాయని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమం ఉద్ధృతం చేయడం ద్వారా తెలంగాణ గట్టిగా ప్రతి స్పందించిందని స్పష్టం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదని గుర్తు చేశారు. అదే చరిత్ర ఇప్పుడు పునరావృతం అవుతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. తాజాగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్న వేళ ఈ మేరకు కేటీఆర్ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement