Tuesday, November 26, 2024

రేణుక చౌదరి పై మహిళా కార్పొరేటర్లు ధ్వజం

ఖమ్మం : ఇ బిఆర్ ఎస్ పార్టీ పైనా, , మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మాజీ కేంద్ర‌మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేటర్లు ద్వజమెత్తారు. ఖమ్మం లోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, AMC చైర్మన్ శ్వేత, కార్పొరేటర్లు కొత్తపల్లి నీరజ, పల్లా రోజ్ లీనా, రుద్రాగాని శ్రీదేవి, తోట ఉమారాణి, ప్రశాంత లక్ష్మీ, చిరుమామిళ్ల లక్ష్మి, రమా దేవి, మందడపు లక్ష్మీ, పైడిపల్లి రోహిణి, దాదే అమృతమ్మా, గోళ్ళ చంద్రకళ, మోతారపు శ్రావణి, కమల, శిరీష, రాధ, నాయకురాలు శోభా రాణి, షకీన లు మాట్లాడుతూ, రేణుకపై మండిపడ్డారు.

రెండు సార్లు పార్లమెంటు సభ్యురాలుగా, పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఈ జిల్లాకు చేసింది ఏమీ లేదని, ఖమ్మం ప్రజలు ఛీ కొట్టారని అయినా సిగ్గులేకుండా ఖమ్మం ఆడబిడ్డను అని చెప్పుకుంటున్నావ‌ని విమర్శించారు. ఉహించని రీతిలో చీమలపాడులో ప్రమాదవశాత్తు జరిగిన ఘటన విచారకరం. అది ఎవరు ఊహించనిది. అలా జరగాలని ఎవరు అనుకోరు.. ఘటనపై తక్షణమే స్పందించి, క్షతగాత్రులకు తక్షణ వైద్య చికిత్సలు అందించి, అవసరం అయిన వారిని హైదరాబాద్ తరలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. మాట్లాడేటపుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని లేదంటే చింత చెట్టుకు కట్టేసి నాలుక పగల చీరుతాం బిడ్డ అని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement