Thursday, September 19, 2024

BRS – ఇదెక్క‌డి న్యాయం… పోలీసుల‌పై విరుచుకుప‌డ్డ కౌశిక్ రెడ్డి

హైద‌రాబాద్ – ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి బ‌య‌లుదేరిన ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిల‌ను పోలీసులు హైజ్ అరెస్టు చేశారు. శంభీపూర్‌ రాజు నివాసం నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి బయల్దేరిన ఇద్దరిని అడ్డుకున్నారు. వారిద్దరిని గృహనిర్భంధంలో ఉంచారు. ఈ సందర్భంగా పోలీసులతో కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్‌ వాళ్లకు ఓ చట్టం.. తమకో చట్టమా అని నిలదీశారు. గాంధీ ఇంటికి పోతామంటే ఎందుకు ఆపుతున్నారని అడిగారు.

దానంకు ఓ న్యాయం .. మాకో న్యాయ‌మా..

మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. దానం నాగేందర్‌కు అనుమతించి తమను అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. ఇది ప్రజా పాలన కాదని, కంచెల పాలన అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కౌశిక్‌ రెడ్డి ని శంభీపూర్‌ రాజు ఇంట్లోకి తీసుకెళ్లి గృహనిర్భందం చేశారు.

తకుముందు పార్టీ కార్యకర్తలతో కలిసి శంభీపూర్‌ రాజు నివాసానికి కౌశిక్‌ రెడ్డి చేరుకున్నారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గాంధీ నివాసానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో జై తెలంగాణ, జై కేసీఆర్‌ నినాదాలతో ఆ ప్రాంత్రం మారుమ్రోగింది. కాగా, శుక్రవారం సాయంత్రం వరకు కౌశిక్‌ రెడ్డి హౌస్‌ అరెస్టు చేస్తున్నామని డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. నగరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement