కోదాడ – కండ్ల ముందే నీళ్లు పోతున్నా ఇవ్వలేని కాంగ్రెస్ లీడర్లు తయారయ్యారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతూ… చంద్రబాబు, వైస్సార్ హయాంలోనూ నోరు మూసుకున్నది వారేనని మండిపడ్డారు. ఆరోగ్యం బాగాలేకున్నా రైతుల కోసం తిరుగుతున్న పోరాట యోధుడు కేసీఆర్ అన్నారు. జేబులో కతెర పెట్టుకునే వాడు… జేబు దొంగనే అన్నారు. మంది లాగులు ఊడగొట్టి ఏమి చూస్తావు రేవంత్ రెడ్డి.. సీఎం అయింది దీని కోసమేనా అని ప్రశ్నించారు.
జనరేటర్ కోసం మళ్లీ లైన్లు
ఇవ్వాళ జనరేటర్ కొనడానికి రైతులు బారులు తీరాల్సి వస్తుందని జగదీశ్‌రెడ్డి అన్నారు. మీరు చెప్పే మార్పు… ఉన్నవి ఊడబీకడమా…? అని ప్రశ్నించారు. పదేళ్లలో ప్రభుత్వం ఏనాడైనా కేసులు పెట్టమని చెప్పామా అన్నారు. ఎవరి కోసం ఏ స్కీమ్ పెడదాం అని ఆలోచించాం.. కానీ వీళ్లు పొద్దున్న లేస్తే… దొంగ మాటలే అని మండిపడ్డారు. సీఎం రేవంత్ లాగానే మంత్రి ఉత్తమ్ కూడా ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. 60ఎండ్ల దుర్మార్గం పాలన చేస్తే ఫ్లోరోసిస్ అవతరించిందన్నారు. కేసీఆర్ ఫ్లోరైడ్ ను పారదోలారన్నారు. ఆనాడు నల్లగొండలో 3 నుంచి 4 లక్షల టన్నుల ధాన్యమే పండగా.. నేడు 40 లక్షల ధాన్యం పండించి దేశానికి నల్లగొండ ధాన్యగారమైందన్నారు. ఓటు వేయించుకుని అబద్దపు పాలన చేస్తున్నారన్నారు. 420 హామీలు ఇచ్చి… మోసం చేస్తున్నారన్నారు.
ఆరు గ్యారెంటీలు ఏమైనయ్..
డిసెంబర్ 9 నుంచి ఇస్తానన్న ఆరు గ్యారంటీ లు ఎటూ పోయాయి.. రైతుబంధు రూ.15 వేలు ఎటూ పోయాయని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. అన్ని పంటలకు ఇస్తాన్నన రూ.500లు బోనస్ ఎటూ పోయే.. కాంగ్రెస్ హామీలు అడిగితే కేసీఆర్ నూ బొంద పెట్టాలి అంటున్నారన్నారు. రుణమాఫీ అడిగితే… బెదిరిస్తున్నారన్నారు. మాట ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలన్నారు. కేసీఆర్ ఎప్పుడైనా చేయగలిగిందే చెప్పాడు.. చెప్పిందే అమలు చేసి చూపించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడుతున్నారు.. బీఆరెస్ కార్యకర్తలనూ వేదిస్తే ఊరుకోమన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపు మాటలనూ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.