Thursday, November 21, 2024

TS | బీఆర్​ఎస్​తోనే మన సంప్రదాయాలు, పండుగ‌ల‌కు ప్రాధాన్యం: నీలం మ‌ధు

మ‌న సంప్ర‌దాయాల‌కు గౌర‌వం.. గ్రామీణ పండుగ‌ల‌కు ప్రాధాన్యం ద‌క్కింది బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలోనే అని, అందుకే అంద‌రం సీఎం కేసీఆర్‌కు, బీఆ ర్ ఎస్ పార్టీకి అండ‌గా నిల‌వాల‌న్నారు పార్టీ రాష్ట్ర నాయ‌కుడు నీలం మ‌ధు ముదిరాజ్‌. ప‌టాన్‌చెరు మండ‌లం చిట్కుల్ గ్రామం.. వ‌డ్డెర కాల‌నీలో ఇవ్వాల (బుధ‌వారం) బోనాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ ఉత్స‌వాల‌కు నీలం మ‌ధు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. అమ్మ‌వారిని ద‌ర్శించుకుని స్థానికుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా నీలం మ‌ధు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు ప‌న్నినా మ‌ళ్లీ బీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, సీఎం కేసీఆర్ సారు హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. అందుక‌ని బీఆర్ ఎస్ పార్టీకి అండ‌గా నిల‌వాల‌ని పిలుపునిచ్చారు.

‌‌– ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో, ప్ర‌భ‌న్యూస్

పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీలో నిర్వహించిన బోనాల మహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన ఫలహారం బండి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోనాల ఉత్సవ నిర్వాహకులు క్రేన్ సహాయంతో నీలం మధు ముదిరాజ్ కు భారీ గజమాల వేసి ఘనంగా సత్కరించారు. బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా తెలంగాణ సంస్కృతిసంప్రదాయాలు ఉట్టిపడే విధంగా నిర్వహించుకోవడం మనకు గర్వకారణమని ఆయన అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగలకు అధికార హోదా కల్పించబట్టే బోనాల ఉత్సవాల‌ను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారని నీల‌మధు అన్నారు. మన సాంప్రదాయాలను మనమే గౌరవించుకోవడంతో పాటు ఇతరుల సంప్రదాయాలకు విలువ ఇచ్చే విధంగా ఉండాలని తెలిపారు. ప‌టాన్‌చెరు అంటే మినీ భారతదేశం అని, ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారని.. వీరందరూ మన సహోదరులే అని ఆయన అన్నారు.

- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ అందరినీ సమానంగా చూస్తూ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుయుక్తులు ప‌న్నినా ఈసారి మ‌ళ్లీ బీఆర్ఎస్ అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధిస్తుందని ఆయన అన్నారు. అందువల్ల మనందరం బీఆర్ఎస్ ను ముందంజలో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ఎవ‌రికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను ముందుంటాన‌ని, అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంకటేశ్, రాజ్ కుమార్, నాయకులు శ్రీను, అభిరామ్, ఈశ్వర్, కుపాస్వామి, R భీమ, శంకర్,రాజు, మారుతి, M భీమ, నాగేష్, రాము, రాజు, ఉదయ్, నాగరాజు, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement