Wednesday, December 18, 2024

TG | ల‌గ‌చ‌ర్ల అంశంపై బీఆర్ఎస్ ప‌ట్టు.. అసెంబ్లీ రేప‌టికి వాయిదా

  • అసెంబ్లీలో చ‌ర్చ‌కు డిమాండ్
  • బీఆర్ఎస్ వాయిదా తీర్మానానికి స్పీక‌ర్ నో
  • స‌భ‌లో బీఆర్ఎస్ నేత‌ల నినాదాలు
  • దోపిడి రాజ్యం, దొంగ‌ల రాజ్యం అంటూ గంద‌ర‌గోళం
  • రైతుల బేడీల ఫోటోల‌తో నిర‌స‌న
  • మార్ష‌ల్స్ వ‌చ్చినా వెన‌క్కి త‌గ్గ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు


హైద‌రాబాద్ – లగచర్ల అంశంపై శాసనసభలో చర్చకు బీఆర్‌ఎస్‌ పట్టుబట్టింది. దీనిపై వాయిదా తీర్మానం కూడా నేడు స్పీక‌ర్ కు అంద‌జేసింది. అయితే ఈ తీర్మానాన్ని స్పీక‌ర్ గడ్డం ప్ర‌సాద్ తిర‌స్క‌రించారు.. అయిన‌ప్ప‌టికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెన‌క్కి త‌గ్గ‌లేదు . పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతుల బేడీల విషయంలో చర్చ చేపట్టాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. చర్చకు అనుమతించాలని ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు.

లగచర్ల అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసనలతో అసెంబ్లీ దద్దరిల్లింది. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై శాసనసభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. రైతులకు బేడీలు వేసిన ఫొటోలతో కూడిన ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. రైతులకు బేడీలు వేస్తారా సిగ్గు సిగ్గు అంటూ విమర్శించారు.

- Advertisement -

బీఆర్‌ఎస్‌ ఆందోళనతో శాసనస‌భ‌ లాబీలో భారీగా మార్షల్స్‌ మోహరించారు. శాసనభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు పంపించేందుకు యత్నించారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదు. పర్యాటక శాఖపై కాకుండా లగచర్ల రైతుల బేడీల విషయంలో చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లగచర్ల అంశంపై ఎందుకు చర్చ చేపట్టడం లేదని ప్రశ్నించారు. విపక్ష సభ్యుల ఆందోళనతో శాసన సభను స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ రేపటికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement