Tuesday, November 26, 2024

TS: నాలుగో తేది తర్వాత బిఆర్ఎస్ కనుమరుగే … కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి, జూన్ 1(ప్రభ న్యూస్) : నాలుగో తేది తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మరో పదేళ్లు తెలంగాణలో రేవంత్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. శనివారం నిజామాబాద్ నగరంలోని కృష్ణ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారనీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాదనుకున్న తెలంగాణ సోనియమ్మతోనే వచ్చిందన్నారు. పది సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేసిందని మండిపడ్డారు.

గొర్రెల స్కామ్ రూ.700 కోట్లు కాదు రూ.4500 కోట్లు అని చెప్పారు. లిక్కర్ స్కామ్ తో బతుకమ్మ కవిత తెలంగాణ రాష్ట్రం పరువు తీసిందని వాపోయారు.. బతుకమ్మల చాటున లిక్కర్ వ్యాపారం చేశారని ఆరోపించారు. రాష్ట్రీయ గీతంపై కేటీఆర్ రాద్ధాంతం చేయడం ఏమిటని ప్రశ్నిం చారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని విమర్శించారు.

రాజముద్ర పై బీఆర్ఎస్ మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో అందరూ రావులే ఉన్నారని విమర్శించారు. నిజామాబాద్ పార్లమెంట్ తో సహా 12స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశవేణు, రాష్ట్ర నాయకులు గడుగు గంగాధర్, వేణురాజ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement