Tuesday, November 26, 2024

బి ఆర్ ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ గుడ్ బై

క‌రీంన‌గ‌ర్ – బి.ఆర్.ఎస్. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ప్రకటించారు. 2018లో ఎటువంటి ప‌ద‌వీ ఆశించ‌కుండా బిఆర్ఎస్ పార్టీలో చేరాన‌ని, ఆ పార్టీ అభివృద్దికి ఎంతో కృషి చేశాన‌ని అన్నారు..అయితే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పోటీ చేసేందుకు ఎటువంటి అవ‌కాశం ల‌భించ‌లేద‌ని చెప్పారు.. దీంతో రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం బిఆర్ఎస్ ను వీడుతున్న‌ట్లు చెప్పారు..


శ్రేయోభిలాషులు, మిత్రులు కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి ఆశించే పెద్దల సలహా మేరకు రాబోయే ఎన్నిల్లో చురుకుగా పాల్గొని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. త్వ‌ర‌లోనే తాను చేర‌బోయే పార్టీని ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement