వాస్తవాలను ప్రశ్నిస్తే సైకోని అవుతానా?
మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమెవ్వరు
తప్పు మీరు చేసి మా మీద రుద్దే యత్నాలు
తప్పుల మీద తప్పులు చేస్తున్న శాడిస్టు సీఎం
కేంద్ర ప్రాజెక్టులు రాష్ట్రం పరిధిలో ఉంటాయా
అవన్నీ కేంద్రం అదానీకి ఇచ్చినవేనని స్పష్టం
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:
తాము అదానీని ఎంకరేజ్ చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నీ లెక్క ఆయన కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు తనది కాదని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఫ్రస్ట్రేషన్లో తనను తిడుతున్నావ్ సరే తనకు ఏమీ ఫరక్ పడదన్నారు. ప్రశ్నిస్తే తాను సైకోనా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లిలో నీ కోసం పనిచేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమయ్యావ్. మరి నువ్వు శాడిస్ట్ వా అని నిలదీశారు. నువ్వు తప్పు చేసి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న శాడిస్ట్ ముఖ్యమంత్రివని ఫైరయ్యారు. ఏం చేస్తావో చేసుకో, తాము నీకు భయపడేవాళ్ల కాదన్నారు.
రాహుల్ గాంధీ సీరియస్తోనే..
అదాని అంశంపై కెటిఆర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడం వల్లే సీఎం రేవంత్ అదానీ ఇచ్చిన వంద కోట్లు తిరస్కరించారని ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. రాహుల్ తిట్టినందుకు రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్లో మాట్లాతున్నారని మండిపడ్డారు కెటిఆర్ . చిట్టినాయుడికి చిప్ దొబ్బినట్లు అనిపిస్తున్నదని అంటూ అదానీతో బీఆర్ఎస్ అనుబంధం ఉందని రేవంత్ ఆరోపించారని అయితే అందులో నిజం లేదన్నారు..
ఆ ప్రాజెక్టులు రాష్ట్రం పరిధిలో ఉంటాయా?
జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా?. రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయా?. ఎంపీగా పనిచేసినోడికి ఈ మాత్రం తెలియదా?. 700 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ల ప్రాజెక్టు కూడా కేంద్రానిదే. డ్రైపోర్ట్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. కేంద్రం అనుమతి ఇస్తే డ్రైపోర్టు నిర్మాణం జరుగుతుంది ఇవన్నీ కేంద్రం అదానికి ఇచ్చిన కాంట్రాక్ట్ లని వివరించారు.. ఇవన్నీ మాకు అంటగట్టడమే ఏమిటని రేవంత్ ను నిలదీశారు. దావోస్లో తాను అదానీని బరాబర్ కలిశానని స్పష్టం చేశారు. మీ మాదిరి కోహినూరులో కాళ్ళు పట్టుకోలేదని చురుకలంటించారు. కేసీఆర్ హాయాంలో అదానీని ఎప్పుడు ప్రోత్సహించలేదని, . అదానీకి రేవంత్ రెడ్ కార్పెట్ వేస్తే.. మేం రెడ్ సిగ్నల్ చూపిందామని వివరించారు.
ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఢిల్లీ నుంచి 8 రూపాయలు కూడా తీసుకురాలేదని, .28సార్లు ఢిల్లీ వెళ్ళి.. రేవంత్ 28 రూపాయలు కూడా తీసుకురాలేదని కెటిఆర్ గుర్తు చేశారు.. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 48 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారన్నారు., వాంకిడి గురుకుల విద్యార్థి శైలజది ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. తల్లిదండ్రుల మాదిరి చూసుకోవాల్సిన ప్రభుత్వమే విద్యార్థులను చంపేస్తోందన్నారు.గురుకుల విద్యార్థుల హత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం’అని కేటీఆర్ హెచ్చరించారు.