Tuesday, November 19, 2024

TG | రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలి.. బిఆర్ఎస్ రాస్తారోకో

మోత్కూర్, (ప్రభ న్యూస్) : బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో రైతు భరోసా నిధులు ఎకరాకు రూ.7500 చొప్పున ఏడాదికి రూ.15000 అందిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం హామీని విస్మరించిందని… తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బిఆర్ఎస్ రాస్తారోకో కార‌ణంగాబస్సులు, వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాస్తారోకోను ఉద్దేశించి బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పోన్నబోయిన రమేష్, జంగ శ్రీనులు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చిత్తశుద్ధి కోల్పోయిందన్నారు. తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయకపోతే బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ యాకుబ్ రెడ్డి, మాజీ సర్పంచ్ బయ్యని పిచ్చయ్య, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు రాంపాక నాగయ్య, ఓయూ జేఏసీ రాష్ట్ర నాయకులు మర్రి అనిల్, బి ఆర్ ఎస్ నాయకులు నాయకులు కొండ సోoమల్లు, గజ్జి మల్లేష్, కోక భిక్షం , విద్యాసాగర్ ,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement