Thursday, November 21, 2024

BRS – రాజ‌గోపాల్ రెడ్డి ఓ మాన‌సిక రోగి – భ‌రిస్తున్న కాంగ్రెస్ కు హాట్సాప్ – చెరుకు సుధాక‌ర్

సూర్యాపేట – బిఆర్ఎస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్న రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కౌంట్ లెస్ అని తెలంగాణ ఉద్యమకారుడు, భీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్ అనుచిత వ్యాఖ్యలపై సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న కోమటిరెడ్డి బ్రదర్స్ పై తీవ్రస్థాయిలోవిరుచుకుపడ్డారు.
ఎన్నికలు దగ్గరికి వస్తా ఉంటే రాజకీయ నాయకులు విమర్శలు – ప్రతి విమర్శలు సాధారణం కానీ నకిరేకల్ ,సూర్యాపేట తుంగతుర్తి లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన బాషా, ప్రవర్తించిన తీరు అత్యంత అసహ్యకరం గా ఉందన్నారు.ఉద్యమకారులను అవమానించే రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు.మునుగోడు ఉప ఎన్నిక తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని అధ:పాతాలానికి తొక్కాలని చూసిన రాజగోపాల్ రెడ్డి పక్కా కమర్షియల్ లీడర్ అని ఎద్దేవా చేశారు. నకిరేకల్, సూర్యాపేట ,తుంగతుర్తిలలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎదుగుదల లేని మానసిక స్థితికి నిదర్శనం అన్నారు.దళిత ఎమ్మెల్యే అయిన చిరుమర్తి లింగయ్య, మంత్రి జగదీష్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరం అన్న చెరుకు ,నల్లగొండ జిల్లా ఉద్యమస్ఫూర్తి ని అవమానించేలా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.తెలంగాణరాష్ట్ర సమితి ఉద్యమ పునాదినుండే జగదీష్ రెడ్డి ఉన్నారన్న చెరుకు సుధాకర్ . ఉద్యమ సమయంలో రాజశేఖరరెడ్డి పాద సేవలో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు జగదీష్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కు 12 స్థానాలలో గులాబీ జెండా ఎగరేసిన సత్తా ఉన్న నాయకుడు జగదీష్ రెడ్డి అన్నారు. మాటిమాటికి బిఆర్ఎస్ అభ్యర్ధులను గేటు తాకనీయమంటున్న రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీ ఏమైనా ఆయన అయ్య జాగిరి కాదు అనే విషయం గుర్తించాలి అని కోరారు. ఏ ఎమ్మెల్యే శాశ్వతం కాదన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి పార్లమెంట్ పరిధిలో శాసనసభ టికెట్లు ఇస్తామని కోట్లు దండుకుంది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. అడ్డగోలుగా మాట్లాడేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా దొరల జాగీరు కాదన్నారు. మునుగోడు ప్రజలు ఇచ్చిన షాక్ కు మతిభ్రమించిన రాజగోపాల్ రెడ్డి పిచ్చివాడిలా రోడ్లపై తిరుగుతుండని విమర్శించారు.
రాజగోపాల్ రెడ్డి లాంటి పనికిరాని వాడితో చర్చలు చర్చలు జరిపే స్థాయి మాది కాదన్నారు.రమేష్ రెడ్డికి వయసు అయిపోలేదన్న రాజగోపాల్ రెడ్డి ఆయనకు ఏమై వయసుఅయిపోయిందని బిజెపి ను వీడిండు అని ప్రశ్నించారు.జగదీష్ రెడ్డి గురించి మాట్లాడేందుకు మీరు ఎవర్రా? అంటూ ఆగ్రహించారు. రాజగోపాల్ రెడ్డి వంటి మానసిక రోగిని భరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి హాట్సాఫ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ని ఓడించడానికి ఇంచార్జ్జ్ గా పని చేసిన దామోదర్ రెడ్డి ఇప్పుడు పక్కన తిప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు. ఆ సమయంలో రాజగోపాల్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు.

కాంగ్రెస్ కేసీఆర్ ను ఎందుకు దించాలో చెప్పే దమ్ము మీలో ఎవరికైనా ఉందా? అంటూ సవాల్ విసిరారు.జీవితమంతా బ్రోకర్ పనులు చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ జోకర్ పనులను తక్షణమే బంద్ చేయాలి అని కోరారు.ప్రత్యామ్నాయం చూపించాలనుకునే కాంగ్రెస్ నాయకులు ముందు వారి ఎజెండా ఎందో చెప్పాలి అని డిమాండ్ చేశారు.ఓబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్న చెరుకు సుధాకర్ ఉదయపూర్ డిక్లరేషన్ ను ఏ తుంగలో తొక్కారో కాంగ్రెస్ నేతలు చెప్పాలి అని తీవ్ర స్థాయి విరుచుకు పడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులను పార్టీ నుండి పంపేయాలి అని కోరారు. తాము పోటీ చేసిన చోట గెలవలేని కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంకోకరిని ఎలా గెలిపిస్తారు? అని ఎద్దేవా చేశారు.
వీరేశంను వీరుడు అన్న రాజగోపాల్ రెడ్డి అదే వీరేశం హంతకుడు అన్నది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. హంతకుడిని వీరుడన్న రాజగోపాల్ రెడ్డి కోదాడరాం లు సిగ్గుపడాలి అని మండిపడ్డారు. పిచ్చి రాజగోపాల్ రెడ్డి గురించి ఆయన స్వగ్రామం బ్రాహ్మణవెల్లెంల లో గ్రామస్తులకే బాగా తెలుసు అన్నారు. బస్సుపై రాళ్లు వేసి అద్దాలు ద్వంసం అయితే సంతోషపడే మానసిక రోగి రాజగోపాల్ రెడ్డి అని విషయం వారి స్వగ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారని ఎద్దేవా చేశారు.కోమటి రెడ్డి బ్రదర్స్ ఇప్పటికైనా జాగిర్థార్ రాజకీయాలను బంద్ చేయకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
మీడియా సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూరబాల సైదులు గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement