Thursday, December 5, 2024

BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

హైదరాబాద్ – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 20 మంది అనుచరులపై సైతం కేసు నమోదైంది.

విధులను అడ్డగించడంతో పాటు బెదిరింపులకు దిగారని ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా,, ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై ఫిర్యాదు చేసేందుకు పాడి కౌశిక్‌రెడ్డి పీఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ ఐజీ శివధర్‌రెడ్డి కలిసి తన ఫోన్‌ని ట్యాప్‌ చేస్తున్నారని.. వీరిద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఫిర్యాదు చేసేందుకు ఆయన పీఎస్‌కి వెళ్లారు.

- Advertisement -

బంజారాహిల్స్ ఏసీపీకి ఇవాళ ఉదయం ఫోన్‌ చేస్తే 3 గంటలకు రమ్మన్నారని.. తాను స్టేషన్‌కు వెళ్లేకన్నా ముందే ఏసీపీ వెళ్లిపోయారని.. సీఐ సైతం వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తే తనతో పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారన్నారు. తాను ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా సీఐ ప్రవర్తించారని.. డీజీపీ కన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఎమ్మెల్యేకు ఉంటుందని సీఐకి ఉంటుందని.. పదవులు లేని సీఎం సోదరులకు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ మిత్రుడి పార్టీకి వెళితే శివధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి.. అక్కడికి పోలీసులను పంపారని.. నా దగ్గర డ్రగ్స్ పెట్టించి కేసు పెట్టించాలని శివధర్ రెడ్డి ప్రయత్నించారన్నారు. సీఎం రేవంత్‌, శివధర్రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement