ఎల్బీనగర్, నవంబర్ 30 (ప్రభ న్యూస్) సార్వత్రిక ఎన్నికల్లో బాగంగా గురువారం ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి,శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన కుటుంభసభ్యులతో కలిసి ముందుగా దిల్ సుఖ్ నగర్ సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించారు.
అనంతరం బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని మారుతి నగర్ లోని ఎస్.ఎస్.ఎస్.విద్యా నికేతన్ స్కూల్ పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన వెంట సుధీర్ రెడ్డి సతీమణి కమల సుధీర్ రెడ్డి , కుమారులు ప్రీతమ్ రెడ్డి,గౌతమ్ రెడ్డి లుకూడా ఓటు వేశారు.
మొదటి రెండు గంటలలో ఎల్బీనగర్లో 5.6% పోలింగ్..
ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఎన్నికల పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతుంది. మొదటి రెండు(7-9) గంటలలో 5.6% పోలింగ్ నమోదయిందనీ ఎన్నికల అధికారులు వెల్లడించారు.
ఖుత్బుల్లాపూర్ నియోజవర్గంలో పరిధిలో 11.00 AM వరకు పోలింగ్ 14.20%
బైక్ పై వచ్చి ఓటేసిన కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ గాజులరామారం తత్వ గ్లోబల్ స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ .. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన కూన శ్రీశైలం గౌడ్..
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న కోలన్ హనుమంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.