బోధన్ – నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా లేదా కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ? అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నవిపేటలో ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్‌ఖు మద్దతుగారోడ్ షో నిర్వహించారు అనంతరం కవిత మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీలు చుట్టపు చూపుగా ఇలా వచ్చిపోతుంటారని అన్నారు. అండగా నిలిచిన ప్రతిసారి తెలంగాణను నిండా ముంచిది గాంధీ కుటుంబం అన్నారు. తెలంగాణకు తీరని మోసం చేసిన గాంధీ కుటుంబం అన్నారు. వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలి తీసుకుందని అన్నారు
ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు అని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడూ శాంతి భద్రతల సమస్య, కర్ఫ్యూలు, మతకల్లోలాలు ఉండేవని, కానీ గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో ఒక్క శాంతి భద్రతల సమస్య రాలేదని వివరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ప్రజలు ప్రశాంతగా జీవిస్తున్నారని చెప్పారు. ప్రశాంతగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు
రైతు బంధు కావాలా లేదా రాబంధు కావాలా ? అని తెలిపారు. కాంగ్రెస్ మూడు గంటల కరెంటు కావాలా… బీఆర్ఎస్ 24 గంటల కరెంటు కావాలా ? అని ప్రజలను అడిగారు. కాంగ్రెస్ పాలనలో చూసిన దారుణమైన పరిస్థితులు కావాలా ? అని కవిత ప్రజలను అడిగారు. రానున్న ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతామని తెలిపారు. బోధన్ లో షకీల్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు