హైదరాబాద్ : అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సమావేశం చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. అయితే పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు.
చైర్మన్‌గా అరికెపూడి గాంధీని నియమించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబును నిలదీశారు. పీఏసీ ఎంపిక తీరును నిరసిస్తూ బహిష్కరించామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పీఏసీ ఎంపీ అప్రజాస్వామికంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. పీఏసీ చైర్మన్ ఎంపిక సమయంలో ప్రతిపక్ష నేతను సంప్రదించలేదని, పీఏసీ చైర్మన్‌ను ఎన్నుకోలేదని అంటూ ఎంపిక చేశారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
- Advertisement -