Sunday, September 8, 2024

ఎంఐఎంతో బిఆర్ఎస్ దోస్తీ – ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు అంగీకారం…

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటును గతంలో ఇచ్చినట్లు-గానే ఈసారి కూడా ఎంఐఎంకు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించినట్లు-గా తెలుస్తోంది. ఈ సీటు- విషయంపై అసదుద్దీన్‌ ఓవైసీ కేసీఆర్‌ ను కలిసిచర్చిం చారు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీ-ఆర్‌ఎస్తో దాదాపు సమానంగా కార్పొరేటర్‌ సీట్లు- గెలిచినప్పటికీ మేయర్‌ పదవికి మజ్లిస్‌ పోటీ- పడలేదు. హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 127 ఓట్లుండగా సింహభాగం ఓట్లు- బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలకు చెందినవే. అసెంబ్లీలో కేటీ-ఆర్‌, అక్బరుద్దీన్‌ మధ్య వాగ్వాదం చోటు- చేసుకున్న సమయంలో వచ్చే ఎన్నికల్లో తాము యాభై స్థానాల్లో పోటీ- చేస్తామని సవాల్‌ చేశారు. అయితే అది వాగ్వాదం మాత్రమేనని రాజకీయంగా రెండు పార్టీల మధ్య కోపరేషన్‌ ఉంటు-ందని అంతా భావిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్నేహపూర్వక ఒప్పందాన్ని కొనసాగించాలని ఈ రెండు పార్టీల ముఖ్య నేతలు అనుకుంటు-న్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement