హైదరాబాద్ – బిఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసింది.. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలుండగా, నేడు 115 స్థానాలకు అభ్యర్ధలు పేర్లను ఆ పార్టీ అధినేత కెసిఆర్ తెలంగాణ భవన్ లో నేడు ప్రకటించారు.. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు నిరాకరించారు.. నాంపల్లి, నర్సాపూర్,జనగాం, గోషా మహాల్ స్థానాల అభ్యర్ధులను తర్వాత ప్రకటించనున్నారు.. , వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ ఘనపూర్, వైరా సిట్టింగ్స్ మార్పులు చేశారు..
ఇక బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ రాబోయే ఎన్నికలలో రెండు స్థానాలలో పోటీ చేయనున్నారు.. సిట్టింగ్ గజ్వేల్ తో పాటు నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి లో పోటీ చేయనున్నారు.. ఇక హుజురాబాద్ నుంచి కౌశిక్ రెడ్డి, దుబ్బాక నుంచి ఎంపి కొత్త ప్రభాకరరెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి సాయన్న కుమార్తె లాస్య బరిలో దిగనున్నారు.. భద్రాచలంలో ఇటీవల పార్టీలో చేరిన తెల్లం వెంకటరావు కు, స్టేషన్ ఘన్ పూర్ లో కడియం శ్రీహరి పోటీ చేయనున్నారు.. బోధ్ లో అనిల్ జాదవ్, ఖానాపూర్ లో భూక్యా జాన్సన్ రాథోడ్ , వేములవాడ నుంచి చల్మడ లక్ష్మీనరసింహరావు, అసిఫాబాద్ నుంచి కోవా లక్ష్మీ, కోరుంట్ల కల్వకుంట్ల సంజయ్ , ఉప్పల్ నుంచి బండారు లక్ష్మారెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి బరిలోకి దిగనున్నారు..