హైదరాబాద్, : ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం బ్రిటన్‌కు వెళ్లారు. సీఎం కేసీఆర్ నాయకత్వలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నేడు ఆమె ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో కీలకోపన్యాసం ఇవ్వనున్నారు.
‘ఎక్స్‌ప్లోరింగ్ ఇన్‌క్లూసివ్ డెవలప్‌మెంట్-ది తెలంగాణ మాడల్’ అనే అంశంపై ఈ ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కవితను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించింది.
ఇందులో పాల్గొనేందుకు ఆదివారం vబ్రిటన్‌కు బయలుదేరిన కవితకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు శంషాబాద్ విమానాశ్రయంలో వీడోలు పలికారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని అంతర్జాతీయ వేదికపై ఆవిషరించే అవకాశాన్ని పొందినందుకు కవితను అభినందించారు. తెలంగాణ ఘనతను అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పడం రాష్ర్టానికి గర్వకారణమని కొనియాడారు