Friday, November 22, 2024

TS: హోరు గాలికి కుప్ప కూలిన నిర్మాణంలోని వంతెన

పెద్దపల్లి జిల్లా ఈదురు గాలుల బీభత్సం సృష్టించింది. ముత్తారం మండలం ఓడేడ్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గర్మి ల్లపల్లి- పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మాణం మధ్యలో ఆగిపోయిన వంతెన బెడ్లు సోమవారం రాత్రి వీసచిన హోరు గాలికి కుప్ప కూలి తాత్కాలిక రోడ్డుపై పడ్డాయి. దీంతో రెండు జిల్లాల మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిత్యం వంతెన పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారిపై రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అదృష్టవశాత్తు అర్ధరాత్రి కావడంతో ఆ రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.
— వర్షకాలంలో కొట్టుకుపోయిన మరో వంతెన..
గత జూన్ నెలలో వరదలకు టేకుమట్ల-రాఘవరెడ్డి పేట గ్రామాల మధ్యలో చలివాగు పై నిర్మించిన వంతెన వరదకు కొట్టుకుపోయింది . ఇప్పుడు నిర్మాణం పూర్తికాకుండానే కేవలం గాలికి ఈ వంతెన కూలడంతో నాలుగు దశాబ్దాల పాటు నిలువాల్సిన వంతెనలు నాలుగు రోజులకి ఇలా ధ్వంసం కావడంపై అధికారులు, కాంట్రాక్టర్ పని తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement