హైదరాబాద్, : ఒకవైపు కొవిడ్ తో జనం అల్లాడిపోతుంటే..మరోవైపు చాపకింద నీరులా నర్సులు, డాక్టర్ల బెడ్, రెమ్‌డెసివిర్ దందా సాగు తోంది వెరసి రోగులు నష్టపోతున్న పరిస్థితి. ప్రస్తుతం రెమ్‌డెసివిర్ అందుబాటులోకి రావడంతో పాటు అధికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే లభిస్తుండడంతొ కరోనా రోగులు ప్రైవేట్ నుంచి సర్కార్ దవాఖాన వైపు మళ్లారు. దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లలో బెడ్ల కొరత ఏర్పడింది. అయితే ఇన్ పేషంట్, అవుట్ పేషంట్ ప్రకారం బెడ్లను సమకూర్చి చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశిస్తున్నప్పటికీ కొంతమంది డాక్టర్లు, నర్సుల అత్యుత్సాహం, అత్యాశతో వారికి ఇష్టం వచ్చిన వారికి బెడ్లను కేటాయిస్తున్నారని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులు వాపోతున్నారు.
ఖమ్మంలో 47ఆసుపత్రులకు కొవిడ్ అనుమతి రాగా..14ఆసుపత్రుల్లోనే ట్రీట్మెంట్
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కు అనుమతి ఇవ్వగా ఒక్క ఖమ్మం జిల్లాలోనే సుమారు 47 ప్రైవేటు ఆసుపత్రులకు కొవిడ్ ట్రీట్మెంట్ కు అనుమతి రాగా, వీటిలో ప్రస్తుతం 14 ఆసుపత్రుల్లోనే కొవిడ్ కు చికిత్స ను అందిస్తున్నారు. అయితే ఇదే సమయంలో మిగతా హస్పిటల్స్ కనీసం రెమ్‌డెసివర్ కోసం కూడా డైరక్ట్ కంపెనీలకు ఆర్డర్ చేయకుండా మిగతా ఆసుపత్రులపై ఆధారప డుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రైవేటు హాస్పిటల్స్‌లో చికిత్సకు అనుమతి ఉన్నా..ఇంజక్షన్‌లు లేకపోవడంతో రోగులు ప్రభు త్వ దవాఖాన్లకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దీన్నే ఆసరాగా చేసుకున్న నర్సులు బెడ్ల లెక్కల్లో తేడాలు చెబుతూ..వారి ఇష్టారీతిన బెడ్ల కేటాయింపు చేస్తు న్నారని తెలుస్తోంది. మొత్తానికి బెడ్ల కేటాయింపుల్లో నర్సులే చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులనే..దేవుడిగా భావిస్తున్న ప్రజలకు కొంతమంది నర్సులు, డాక్టర్లు చేస్తున్న వికృత చేష్టలతో యావత్ వైద్య రంగానికే కళంకం వస్తుందని పలువురు వైద్యులు చెబుతున్నారు.
డాక్టర్లు, నర్సులపై పర్యవేక్షణ అవసరం
కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో వైద్యులే..మరో దేవుడిగా కనిపిస్తున్నప్పటికీ కొంత మంది చేష్టలూ విరక్తిని కలిగిస్తున్నాయంటూ పలువు రు రోగులు చెబుతున్నారు. ఈ సమయంలో అత్య వసర పరిస్థితిని ఆసరా చేసుకుని డబ్బలు గుంజుతున్న నర్సులు, డాక్టర్ల పట్ల ప్రభుత్వమే పర్యవేక్షణ కమిటీని నియమించాలని పలువురు సూచిస్తున్నారు.
కరోనా బయటపెడుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల భాగోతం
కరోనా పుణ్యమా అని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రలు భాగోతం కూడా బయటపడుతోంది. ఇప్పటి వరకు డాంభికాలు పలికే ప్రైవేట్ హాస్పిటల్స్ వారివన్ని ఉత్త మాటలే అని తెలిసిపోతున్నాయి. రెమ్ డెసివర్ ఇంజ క్షన్ లకు డైరక్ట్ గా కూడా ఆర్డర్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి కొన్ని ఆసుపత్రులు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలోనే 47 హస్పిటల్స్ కు కొవిడ్ చికిత్సకు అనుమతి రాగా, వాటిలో 14 మాత్రమే చికిత్సను అందిస్తుండడం గమనార్హం. కారణం మిగతా ఆసుపత్రలకు మెడికల్ షాపులకు సంబంధించి కూడా జీఎస్టీ లు కూడా సరిగా లేకపోవడంతో కంపెనీలకు ఆర్డర్ చేయకుండా మిగతా ప్రైవేటు ఆసుప్రతుల నుంచి తెప్పించుకోవడంతో పాటు చాలా వరకు బ్లాక్ లోనే కొనుగోలు చేసి పేషంట్లకు ఇచ్చినట్లు తెలు స్తోంది. దీంతో పాటు ఆక్సిజన్, బెడ్లు, స్టాఫ్ ఇలా అన్నింటికి కొరత ఉన్న హస్పిటల్స్ చాలానె బయటపడుతున్నాయి.
నిన్న, మొన్నటి వరకు రెమ్‌డెసివర్ ఇంజక్షన్ వైపు ఉన్న డబ్బుల దందా..నేడు కొత్తగా ప్రభుత్వ హాస్పటల్స్‌లో బెడ్ల వైపు మళ్లింది. వాస్తవానికి రోగి సమస్యతో వస్తే..మొదట సంబంధిత డాక్టర్ పరీక్ష జరిపి, నిర్ధారించిన తరువాతనే ఆ పేషంట్ కు ఎక్కడ బెడ్ ఇవ్వాలి, ఏ మెడిసిన్ వాడాలని వైద్యులు నర్సుల కు సూచిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి విరుద్ధంగా డాక్టర్ పేషంట్ పరీక్ష జరిపి, నిర్ధారించి నర్సులకు సూచించే లోపే సంబంధిత పేషంట్ కు నర్సులు బెడ్ లు ఇస్తున్నారని సమాచారం.
నర్సులే బెడ్ లను కేటాయిస్తుండగా ఇందులో ఐసీయు, సాధారణ రూంల్లో బెడ్లకు రేట్లు ఉన్నాయని కూడా సమాచారం. ఐసీయూలో అయితే సుమారు రూ.1500 నుంచి 2 వేల వరకు తీసుకుని బెడ్లు ఇస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయాన్ని ఎక్కడ బెడ్ పోతుందోనన్న భయంతో ఎవరికి వారే మిన్నుకుండిపోతున్న పరిస్థితి.
డబ్బుంటేనే బెడ్….
Advertisement
తాజా వార్తలు
Advertisement