వైయస్సార్ టిపి పార్టీ అధినేత వైయస్ షర్మిల మెదక్ జిల్లాలో చేస్తున్న దీక్ష భగ్నమైంది. నిన్న మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఇవాళ ఆమె పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు రవి రవికుమార్ కుటుంభానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని నిరాహార దీక్షకు కూర్చున్నారు షర్మిల. కొద్దిసేపటి క్రితం పోలీసులు రంగంలోకి దిగి వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి, ఆమె చేస్తున్న దీక్షను భగ్నం చేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఆమెతో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలం బొగుడ భూపతిపూర్ కు చెందిన రవి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు దీక్ష చేస్తున్న సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… రైతు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారని.. రైతు గుండె ఆగిపోయేలా కేసీఆర్ చేస్తున్నారని ఆగ్రహించారు. వరి వద్దన్న సీఎం మనకు వద్దని… తెలంగాణ రాష్ట్రంలో వరి వేయొద్దు అనే హక్కు సీఎం కేసీఆర్ కు లేదని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital