మునుగోడు పర్యటనలో ఉన్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ప్రజా దీవెన సభలో ఆయన ప్రసంగించారు. శివన్న గూడెం గ్రామంలో నేను నిద్ర కూడా చేశానన్నారు సీఎం. మిషన్ భగీరథ పేరుతో ఫ్లోరైడ్ లేని నీళ్లు అందిస్తున్నామన్నారు. మునుగోడు ఫ్లోరైడ్ సమస్యతో ఎలా బాధపడిందో అందరికీ తెలుసన్నారు. నల్గొండ జిల్లా మానవరహిత ప్రాంతం అవుతుందని డబ్ల్యూ హెచ్ వో హెచ్చరించిందన్నారు. డబ్ల్యూ హెచ్ వో హెచ్చరించినా అప్పటి కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు కేసీఆర్. ఫ్లోరైడ్ సమస్యని ఎవరూ పరిష్కరించలేదు…ఫ్లోరైడ్ రహిత మునుగోడుగా మనం మార్చుకున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement