వికారాబాద్ ( ప్రభ న్యూస్): జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత కొంతకాలంగా ఎండలతో సతమతమైన ప్రజలు ఈ వర్షంతో ఊరట చెందారు .40 డిగ్రీల పైన ఎండలు ఉండడంతో ప్రజలు బయటికి రాని పరిస్థితుల్లో సాయంత్రం కురిసిన వర్షంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. దాదాపు గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లపై నీరు ఏరులై పారాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పాటు సమీప మండలాలైన పూడూరు దారూరు మర్పల్లి, మోమిన్ పేట్ లలో భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement