‘‘నేను ఎలాంటి పోర్జరీ చేయలేదు.. అయినా నా నామినేషన్ తిరస్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే నా నామినేషన్ పేపర్లలో సాంకేతిక కారణాలున్నాయని, అందుకే తిరస్కరించినట్టు అధికారులు చెప్పారు’’ అని నిజామాబాద్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీనివాస్ తెలిపారు. నామినేషన్ పేపర్లలో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేని కారణంగా తిరస్కరణకు గురయ్యింది అని వివరించారు శ్రీనివాస్. అయితే కొంతమంది తనపై చేస్తున్న పోర్జరీ ఆరోపణల్లో వాస్తవం లేదని, అట్లాంటి పనేమి తాను చేయలేదని వివరణ ఇచ్చారు.
కాగా, సీఎం కేసీ ఆర్ తనయ, కల్వకుంట్ల కవితపై పోటీగా శ్రీనివాస్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. దీనిపై కొంతమంది ఎంపీటీసీలు తమ సంతకాలు పోర్జరీ అయ్యాయని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..