హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్‌లో సాంకేతిక కారణాల వల్ల సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో ఔట్ పేషెంట్ విభాగంలో ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్లంతా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దాదాపు 3 గంటలకు పైగా సర్వర్లు మొరాయించడంతో ప్రిస్క్రిప్షన్, డాక్టర్ కన్సల్టెన్సీ చీటీలు రాయడంలో ఆలస్యం అయ్యింది.
దీంతో గంటలపాటు ఔట్ పేషెంట్ విభాగంలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురైంది. అంతే కాకుండా వాటర్ ఫెసిలిటీ కూడా సక్రమంగా లేదని, దీంతో బయట షాపుల వద్ద కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.