Friday, November 22, 2024

Breaking News – క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్‌, సూర్యాపేట : ఈత సరదా ముగ్గురి ప్రాణాల‌ను తీసింది. చిన్నారి ఈత సరదా తీర్చేందుకు వెళ్లిన తండ్రి, సమీప బంధువు ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు చెందిన శ్రావెల్య రాజు, ఆత్మకూర్ ఎస్‌.మండలంలో బంధువుల ఇంట్లో ఫంక్షన్ కు హాజరయ్యారు. రాత్రి అక్కడే ఉన్న వారు రాజు కుమార్తె శ్రావెల్య ఉష (12) క్వారీలో ఈత కొడదామని తండ్రిని అడుగగా తీసుకువెళ్లారు.

క్వారీ లోతుగా ఉండడంతో మునిగిపోతున్న కుమార్తెను రక్షించేందుకు తండ్రి రాజు సైతం నీళ్లలోకి దిగాడు. రాజు సైతం మునిగిపోతుండడంతో తన మిత్రుడు చిప్పారెడ్డి శ్రీపాల్ రెడ్డి వారిని రక్షించేందుకు వెళ్లి నీటిలో మునిగి ముగ్గురు మృతిచెందారు. కాగా శ్రీకాంత్ రెడ్డిది జూపెడ మండలం తిరుమలేపాలెం. బంధువుల ఇంటికి వచ్చి మృత్యువాత పడడంతో బొప్పారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement