న్యూఢిల్లీ – సుప్రీం కోర్టులో గ్రూప్ 1 అభ్యర్ధులకు చుక్కెదురైంది.. పరీక్షల వాయిదా వేసేందుకు నిరాకరించింది. దీంతో నేటి మధ్యాహ్నం నుంచి యధావిధిగా పరీక్షలు జరగనున్నాయి.. పరీక్షల ఏర్పాటు చివరిదశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సైతం నిరాకరించింది. ఇప్పటికే ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో సాగుతుండటంతో అక్కడే పరిష్కరించుకోవాలని సూచించింది.. ఇదే విధంగా ఈ అభ్యర్ధలు దాఖలు చేసిన పిటిషన్ లపై తుది తీర్పు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు ముందే ఇవ్వాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement