Saturday, October 26, 2024

Breaking News – కానిస్టేబుళ్ల భార్య‌ల ఆందోళ‌న – ఆ నిర్ణయంపై వెన‌క్కి త‌గ్గిన పోలీస్ శాఖ

హైద‌రాబాద్ – బెటాలియ‌న్ కానిస్టేబుళ్ల కుటుంబాల ఆందోళ‌న నేప‌థ్యంలో పోలీస్ శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. గతంలో ఇచ్చిన సెలవుల రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై కానిస్టేబుళ్ల కుటుంబాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమని తెలిపింది. . ఈ మేరకు స్పెషల్‌ అదనపు డీజీపీ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సెలవుల విషయంలో తెలంగాణ బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు ఊరట లభించింది.

కాగా, తమ భర్తలను కూలీల కంటే హీనంగా చూస్తున్నారని . తెలంగాణ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా పోలీస్ కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనలు చేస్తున్నారు.. రాష్ట్రంలో ఒకే పోలీసు విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన పోలీస్ శాఖ బెటాలియ‌న్ పోలీసుల సెల‌వుల ర‌ద్దు ఆదేశాల‌ను వెన‌క్కి తీసుకుంది.

ఇది ఇలా ఉంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బెటాలియన్‌ కానిస్టేబుళ్లు 15 రోజులకు ఒకసారి సెలవుపై వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చి కొత్త లీవ్‌ మాన్యువల్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లిన కానిస్టేబుళ్లు.. ఇకపై 26 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ మ్యాన్యువల్‌పై బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు బెటాలియన్ల ముందు ధర్నా చేయగా.. ఇవాళ సెక్రటేరియట్‌ ముట్టడికి కూడా యత్నించారు. దీంతో దిగొచ్చిన పోలీస్ శాఖ ఆ జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement