Friday, September 20, 2024

Breaking News – జర్నలిస్టుల అక్రమ భూమి రిజిస్ట్రేషన్ లు రద్దు.

ఆంధ్రప్రభ స్మార్ట్, నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎనిమిది మంది జర్నలిస్టులు జీవో నెంబర్ 59 లోని లొసుగులను ఆసరా చేసుకొని ఇరిగేషన్ శాఖకు చెందిన సుమారు రూ.10 కోట్ల విలువ చేసే భూమిని గత ఏడాది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ అంశంపై జర్నలిస్టు సంఘాలు అదనపు కలెక్టర్ స్పందించారు. జర్నలిస్టుల అక్రమ రిజిస్ట్రేషన్ లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నెంబర్ 59 ప్రకారం జర్నలిస్టులు నకిలీ పత్రాలను సృష్టించి గత ఏడాది జూలై 28న నలగొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీనిపై జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేయడంతో అప్పటి కలెక్టర్ ఆర్ వి కర్ణన్ స్పందించి అదనపు కలెక్టర్ శ్రీనివాసును విచారణ అధికారిగా నియమించారు.

జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అదనపు కలెక్టర్ జర్నలిస్టులు అక్రమంగా ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, వీటిని రద్దు చేయాలని సీసీఎల్ఏకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు సీసీఎల్ఏ ఈ రిజిస్ట్రేషన్ లను రద్దు చేసేందుకు నిర్ణయించింది. సీసీఎల్ఏ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ 8 మంది జర్నలిస్టులు చేసుకున్న 2232 గజాల భూమి రిజిస్ట్రేషన్ లను రద్దు చేస్తూ గత నెల 14న ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని కారణాలవల్ల ఈ ఉత్తర్వులను అధికారులు బహిర్గతం చేయలేదు. అధికారుల అలసత్వం పై జర్నలిస్టు సంఘాలు గత రెండు రోజుల నుంచి ఆందోళన జరుపుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం బుధవారం ఉత్తర్వుల కాపీని బహిర్గతం చేసింది.

- Advertisement -

ఇలా ఉండగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడ్డ విలేకరుల రిజిస్ట్రేషన్ లను రద్దు సంతోషించే పరిణామమే, వారి అక్రమాలకు అండగా నిలబడి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 8 మంది జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టాలపై ప్రజలకు మరింత గౌరవం పెరిగేలా చూడాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement