ప్రభా న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: వామ్మో పులి.. పులి పేరు వినగానే ప్రతి ఒక్కరూ గజగజ వణకాల్సిందే. అడవిలో ఉంటేనే మిగతా జంతువులు ఆ వైపు వెళ్లాలంటేనే జంకుతాయి. దాని బారినుండి ప్రాణాలు కాపాడుకోవడానికి నానా తంటాలు పడతాయి. అలాంటిది గత ఐదు రోజులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పులి సంచరించడంతో ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరి పై దాడి చేస్తుందనే భయాందోళన చెందుతున్నారు. తాజాగా సోమవారం ఉదయం పులి అడుగు జాడలు కనిపించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకరపల్లి గ్రామ శివారు లోని గోడన్ వద్ద రాత్రి సుమారు 10 గంటల సమయంలో సూరం రాములు అనే వ్యక్తి పులిని చూసినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఉదయం తాను చూసిన ప్రాంతాన్ని వెళ్లి పరిశీలించగా ఆ ప్రదేశంలో పులి అడుగు జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. కాగా తాజాగా సోమవారం ఉదయం మల్హర్ మండలం రుద్రారం సుభాష్ నగర్ సమీపంలో పులిని పలువురు గ్రామస్తులు చూసినట్లు తెలిపారు. శభాష్ నగర్ గ్రామ శివారులో నీలగిరి తోటలో నుండి పత్తి చేనులోకి పులి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం పులి ఆ పత్తి చేనులో మాటువేసి ఉన్నట్లు పలువురు తెలిపారు. ఉదయం నుండి దేవరంపల్లి, శంకరంపల్లి, సుభాష్ నగర్, రుద్రారం, మాధవరావుపల్లి గ్రామస్తులు పులి సంచారంతో గజగజ వణుకుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. గత ఐదు రోజులుగా కాటారం సబ్ డివిజన్లో పులి సంచరించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే ఒడిపిలవంచ పోచమ్మ వద్ద అక్కేమ్మ ఆవు పై జరిగిన దాడి పెద్దపులిగా అనుమానిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital