హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ స్వంత నియోజకవర్గంలో భాగంగా ఉన్న లగచర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉప సంహరించుకుంది.. ఈ మేరకు ఇప్పటికే విడుదల చేసిన భూ సేకరణ నోటిఫికేషన్ ను నేడు రద్దు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.. ఈ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది.
కాగా, లగచర్లలో ఫార్మా విలేజ్ ను ఏర్పాటు ను నిరసిస్తూ ఇక్కడి ప్రజలు ఆందోళన బాట పట్టారు.. ఈ సందర్భంగా అధికారులపై దాడులు కూడా చేశారు.. ఈ ఘటనలో సుమారు 30 మంది వరకు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా జైలులోనే ఉన్నారు.. దీనిపై బిఆర్ ఎస్ కూడా తీవ్ర నిరసన తెలిపింది.. అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఫార్మా విలేజ్ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేసింది.. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన నిరసన దృష్టిలో ఉంచుకుని ఫార్మా విలేజ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉప సంహరించుకుంది..