Tuesday, October 29, 2024

Breaking News – షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం

జనగామ కలెక్టరేట్ , ( ఆంధ్ర ప్రభ ) జనగామ జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం బస్ స్టాండ్ రోడ్ లోని విజయ షాపింగ్ మాల్లో ఎగసిపడుతున్న మంటలను చూసి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు

దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే, బట్టల షాప్ కావడంతో మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మంటలు అదుపులోకి వచ్చిన తరువాతే ఆస్తి నష్టం, ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. జిల్లా కేంద్రంలో ప్రముఖ వస్త్ర దుకాణం కావడంతో ఆస్తి నష్టం భారీగా వుంటుందని భావిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement