(సిద్దిపేట ప్రతినిధి) : సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ తన కుటుంబ సభ్యులను తుపాకీతో కాల్చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద పిఎస్ఒగా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు వారీగా విధులు నిర్వహించుకుని ఇంటికి 9ఎంఎం తుపాకీతో వచ్చాడు.
ఆకుల నరేష్(35) తన భార్య ఆకుల చైతన్య (30), కొడుకు ఆకుల రేవంత్ (6), ఆకుల రిషిత(5) లను తుపాకీతో కాల్చి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కసారిగా ఈ ఘటన కలకలం రేపింది. గన్మెన్ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులా, మరేమైనా ఇతర కారణాలున్నాయా అని తెలియాల్సి ఉంది. కుటుంబం మొత్తం ఒకేసారి ఇంత ఆఘాయిత్యానికి పాల్పడడం విషాదాన్ని నింపింది. ఈఘటన పోలీసులతో పాటు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.