Friday, November 22, 2024

Breaking : సీఎం కేసీఆర్ కి కడుపులో చిన్న అల్సర్.. ఏఐజీ డాక్ట‌ర్స్

సీఎం కేసీఆర్ ఆరోగ్యం సాధార‌ణంగా ఉంద‌న్నారు డాక్ట‌ర్స్. ఏఐజీ చైర్మ‌న్ నాగేశ్వ‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది ఉంద‌న్నారు.ఈ మేర‌కు సీఎం కేసీఆర్ కి సీటీ,ఎండోస్కోపీ వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌న్నారు వైద్యులు.సంబంధిత వైద్య చికిత్స అందిస్తున్నామ‌న్నారు ఏఐజీ డాక్ట‌ర్స్. కాగా కేసీఆర్ కి అల్సర్‌ ఉన్నట్టుగా తెలిపారు. సీఎం కేసీఆర్‌కు పొత్తి కడుపులో అసౌకర్యం ఏర్పడిందని వెల్లడించారు. కడుపు నొప్పితో సీఎం కేసీఆర్‌ వచ్చారని తెలిపారు. ఎండోస్కోపి, సిటీ స్కాన్ చేసినట్టుగా వెల్లడించారు వైద్యులు.ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈరోజు ఉదయం పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడింది అని తెలిసింది. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి కేసీఆర్‌కు పరీక్షలు చేపట్టారు . ఆ తర్వాత ఆయనను ఏఐజీ ఆస్పత్రికి తీసుకురావడం జరిగింది. ఆస్పత్రిలో కేసీఆర్‌కు సీటీ, ఎండోస్కోపీ చేయడం జరిగింది . కడుపులో ఒక చిన్న అల్సర్ కనుగొనబడింది.కానీ దీనికి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని తెలిపారు వైద్యులు. అది మందులతో తగ్గిపోతుంది. ఆయన మిగిలిన అన్ని పారామిటర్స్ సాధారణంగా ఉన్నాయి. తగిన మెడికేషన్ కూడా ఇస్తుమన్నారు వైద్యులు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement