Tuesday, November 26, 2024

Breaking : చండూరు పోలింగ్ బూత్ వద్ద అపశృతి .. గేడు గ్రిల్స్ లో ఇరుక్కున మహిళ కాలు

మునుగోడు ఉప ఎన్నికలో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్‌ జరిగింది. కాగా చండూరు పోలింగ్ బూత్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. పోలింగ్‌ కేంద్రం గేడు గ్రిల్స్‌లో మహిళ కాలు ఇరుక్కుంది. గేటు వద్ద ఉన్న ఇనుప పైప్‌లలో మహిళ కాలు ఇరుక్కుంది. దీంతో.. ఇది గమనించిన స్థానికులు మహిళను రక్షించారు. ఇదిలా ఉంటే.. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నిక సరళిని పరిశీలిస్తున్నారు ఈసీ అధికారులు. 298 కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతోందని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు.పలు చోట్ల పోలింగ్‌ కేంద్రాల వద్ద పార్టీల శ్రేణులు ఆందోళనకు దిగారు. స్థానికేతరులు ఉన్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారిని పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసిన చెదరగొట్టారు. అయితే.. మునుగోడు మండలం కొంపల్లిలో ఈవీఎం మొరాయించింది. దీంతో ఈవీఎం మార్చి ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు అధికారులు. ఫేక్‌ ప్రచారాలపై విచారణ చేపట్టామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement