తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకులంలో కరోనా కలకలం రేగింది. 42 మంది స్టూడెంట్స్‌తో పాటు ఒక టీచర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆ స్కూల్ లో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. ఆదివారం 261మంది విద్యార్థులు, 27మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో 43మందికి కరోనా సోకినట్లు తేలింది. మిగతా వారికి సోమవారం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు జీనోమ్ స్వీక్వెన్సింగ్ కు పంపారు. విద్యార్థులను హాస్టల్ లోనే క్వారంటైన్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..