తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై బీజేపీ ప్రోగ్రామ్ నిర్వహించడానికి పిలుపునిచ్చింది. ఇవ్వాల (గురువారం) ఉదయమే హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి బాటసింగారం వెళ్లడానికి బయలు దేరారు. కాగా, అతను ఎయిర్పోర్టు పరిసరాలు దాటగానే పోలీసులు అడ్డుకున్నారు. డబుల్ ఇండ్ల పరిశీలించాలన్న పిలుపు మేరకు పెద్ద ఎత్తున బీజేపీ లీడర్లు, ఎమ్మెల్యేలు , కార్యకర్తలు తరలివచ్చారు.
అయితే.. ముందస్తుగా ఎట్లాంటి అనుమతి లేదని, అందుకనే అడ్డుకుంటున్నామని పోలీసులు తెలిపారు. అయినా సీన్ క్రియేట్ చేశారు బీజేపీ నేతలు. దీంతో పోలీసులు వారిని కదలకుండా అడ్డుకుని, కార్యకర్తలను వాహనంలో తరలించేందుకు రెడీ అయ్యారు. దీంతో కిషన్రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ కలిసి రోడ్డుపై భైటాయించి నిరసన తెలిపారు.